Header Banner

వసంత పంచమి వేళ ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తిన భక్తులు! పూలవర్షం కురిపించిన అధికారులు

  Mon Feb 03, 2025 12:02        Devotional

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళ భక్తజన సంద్రమైంది. నేడు వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే చలినిసైతం లెక్కచేయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారిపై నిర్వాహకులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. 

 

ఇంకా చదవండిజగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మరోవైపు ఇవాళ ఉదయం 8 గంటల వరకూ దాదాపు 63 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్‌ తెలిపింది. వసంత పంచమిని పురస్కరించుకుని 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ క్రమంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. మూడంచెల భద్రత నడుమ భక్తులు అమృత స్నానాలు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటుచేయడంతోపాటు ఘాట్ల వద్ద సింగల్‌ లైన్‌లో పంపిస్తున్నారు. అదేవిధంగా ప్రయాగ్‌రాజ్‌ లోపలికి కార్లను అనుమతించడం లేదు. బయటి రాష్ట్రాలనుంచి వచ్చే భక్తుల కోసం 84 పార్కింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 54 అతి జనసాంద్రత నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్‌ మామూలుగా లేదుగా!

 

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

  

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #Kumbhamela #Festivals